కూనీపూర్ లో భూముల రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి : కలెక్టర్ ఆదేశం
- ఉత్తమ పనితీరు కనబర్చిన సర్వేయర్లకు నగదు పారితోషికాలు
తప్పిదాలకు తావులేకుండా వేగవంతంగా రీ సర్వే జరిపిన సర్వేయర్లను ఎంపిక చేసి నగదు పారితోషికాలు అందజేస్తామని ప్రకటించారు. ఈ నెలాఖరు లోపు నిర్దేశిత లక్ష్యాలను అధిగమించిన వారికి మొదటి బహుమతి కింద రూ.10వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 5వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 3వేలు, నాలుగు, ఐదవ స్థానంలో ఎంపికైన వారికి రూ.2వేలు, వేయి రూపాయల నగదు పారితోషికం అందజేస్తామని అన్నారు. గడువు సమీపిస్తున్న దృష్ట్యా సెలవు దినాలలో సైతం రీ సర్వే ప్రక్రియను కొనసాగించాలని, తాను కూడా క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ యజమానులు, రైతులు కూడా భూ రీసర్వే ప్రక్రియకు పూర్తిస్థాయిలో సహకరించాలని, ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రీసర్వే పనుల్లో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తద్వారా భూ వివాదాలు సమసిపోయి, రైతులకు వారి భూములపై ఖచ్చితమైన హక్కుల నిర్ధారణ అవుతుందన్నారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాజాగౌడ్, బోధన్ ఆర్డీఓ విజయ కుమారి, వర్ని తహసీల్దార్ ప్రశాంత్, స్థానిక సర్పంచ్ లక్ష్మణ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, గ్రామ పెద్దలు ఉన్నారు.
