నిర్మల్లో ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధానోత్సవం.
- ఉపాధ్యాయుల సేవలు సమాజ నిర్మాణానికి పునాది. మున్సిపల్ ఛైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి
నిర్మల్ పట్టణంలో తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఆర్.కె. ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గురుశ్రేష్ఠ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మల్ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి అప్పాల కావ్య, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని అన్నారు. విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను బోధిస్తూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని కొనియాడారు.
విద్యారంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తించి గురుశ్రేష్ఠ అవార్డులతో సత్కరించడం ప్రశంసనీయమని తెలిపారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ విద్యారంగ అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, కత్తి నరేందర్, మాజీ కౌన్సిలర్ తోట నర్సయ్య, ట్రస్మా జిల్లా ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యారంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
