లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం
జన్నారం మండలకేంద్రంలో మండల లయన్స్ క్లబ్ అద్వర్యంలో ప్రపంచ మదుమేహం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత మదుమేహ పరిక్షల శిభిరాన్ని నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో మదుమేహం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వస్తే ఈ విదంగా మందులు తీసుకోవాలి ఏ ఆహారం వ్యాయామం తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సుమారుగా 100 మందికి పరిక్షలు చేశారు. ఈ సందర్బంగా మండల లయన్స్ క్లబ్ అద్యక్షులు బండారు మరుతిరాజు మాట్లాడుతూ సమాజసేవలో లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందువరుసలో ఉంటుందని ప్రజలను ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్పర్సన్ లయన్ జక్కు భూమేష్ జోన్ చైర్పర్సన్ లయన్ మదంశెట్టి మల్లికార్జున్ సబ్యులు మల్యాల బాపన్న,వావిలాల రాజు,ప్రవీణ్ కుమార్,జాజాల శ్రీనివాస్,కస్తూరి సతిష్ కుమార్,సైన్ల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
