📅 Saturday, 14 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS విశ్రాంత సింగరేణి ఉద్యోగులకు అవగాహన.
‹
›
District News

33 రోజుల సమ్మెకు తాత్కాలిక విరామం.. విధుల్లోకి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
33 రోజుల సమ్మెకు తాత్కాలిక విరామం.. విధుల్లోకి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు
  • జిల్లా వైద్యాధికారి డా. రాజేందర్‌కు సమ్మె విరమణ లేఖ అందజేసిన ఉద్యోగ సంఘం నాయకులు
నిర్మల్ నవంబర్ 14 సాక్షర ప్రతినిధి
నిర్మల్ జిల్లాలో గత 33 రోజులుగా కొనసాగుతున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల నిరవధిక సమ్మెకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘం నాయకులు తెలిపారు.ఈ మేరకు నేడు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నాయకులు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. రాజేందర్‌ను కలిసి సమ్మె విరమణకు సంబంధించిన లేఖను అందజేశారు. ప్రభుత్వ హామీని పరిగణనలోకి తీసుకొని సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నామని, నేటి నుంచే ఉద్యోగులందరూ తిరిగి విధుల్లో చేరుతున్నారని ఆయనకు తెలియజేశారు.గత 33 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగులు, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతానికి ఆందోళనను నిలిపివేసి విధులకు హాజరవుతున్నారు.