రెబ్బెనసాక్షర:స్వదేశీ వస్తువులు స్వచ్చంగా, నాణ్యతగా ఉంటాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీరమేష్ అన్నారు.శనివారం గోలేటి సీఈఆర్ క్లబ్ లో వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ వారు ఏర్పాటు చేసిన ఖాదీ మేళా స్టాల్ ని జిఎం ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా గాంధీ గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం స్టాల్ లోని వస్త్రాలను పరిశీలించారు.రాయితీ వివరాలు ఉద్యోగులకు స్పష్టంగా వివరించాలని జిఎం నిర్వాహకులకు సూచించారు.నవంబర్ 7వ తేదీ వరకు నిత్యం ఉధయం 9గంటల నుండి రాత్రి 9గంటల వరకు మేళా నిర్వహించ బడుతుందని తెలిపారు.వస్త్రాల కొనుగోలుపై 25నుండి 30శాతం వరకు రాయితీ ఉంటుందని,20వేల వరకు వస్త్రాలను క్రెడిట్ పై అందిస్తామని 5వాయిదాలలో జీతం నుండి పే స్లిప్ ద్వారా చెల్లింపు అవకాశం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి,ఏరియా ఇంజినీర్ వీరన్న,డిజిఎం(ఐఈడి)ఉజ్వల్ కుమార్ బెహరా,సీనియర్ పర్సనల్ అధికారులు ఎం.శ్రీనివాస్,డి.ప్రశాంత్,నిర్వాహకులు చంద్రమౌళి,రాజేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER