📅 Thursday, 19 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
26°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
‹
›
District News

కామారెడ్డి వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై 14 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సస్పెన్షన్

◉ T PRAKASH RAO   |   ◷ Latest
  • బాధితుల్లో ఒక విద్యార్థి జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసి)కి ఫిర్యాదు- ఈ ఘటనపై తీవ్రంగా పరిగణించిన ఎన్‌ఎంసి
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్ 4: కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇటీవల చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటన కాలకాలం రేపింది. ర్యాగింగ్ ఘటనలో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు 14 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన పై విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇటివల దసరా సెలవుల తర్వాత కృష్ణ మందిర్‌లోని ప్రథమ సంవత్సరం విద్యార్థుల హాస్టల్‌లోకి పలువురు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రవేశించి, కొత్తగా చేరిన వైద్య విద్యార్థులను ర్యాగింగ్‌కు గురిచేశారు. అయితే హాస్టల్ ప్రాంగణంలోకి బలవంతంగా ప్రవేశించడం ఈ ఘటనలో భాగమని సమాచారం. ఈ విషయమై బాధితుల్లో ఒక విద్యార్థి జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసి)కి ఫిర్యాదు చేయగా, ఎన్‌ఎంసి ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, స్థానిక పోలీసులను మరియు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని అప్రమత్తం చేసింది.
ఈ ఘటన అనంతరం, కళాశాల అధికారులు పలు సమావేశాలు నిర్వహించి, జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులతో కలిసి విషయంపై చర్చించారు. పోలీసులు క్యాంపస్‌లో ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అంతర్గత విచారణలో, ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులను కళాశాల అధికారులు గుర్తించి, వారిని సస్పెండ్ చేశారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాల్యా ద్వారా తెలిపిన సమాచారం మేరకు ఆ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాస్టల్ బయట నివసిస్తున్నారని, వారు ప్రథమ సంవత్సరం హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించారని ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారని కళాశాల విచారణ కమిటీ కనుగొంది. ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేయగా, ఇతర విద్యార్థులను కూడా అదే కాలానికి తరగతులకు హాజరు కాకుండా నిషేధించినట్లు ఆయన చెప్పారు. హాస్టళ్లలోనే నివసిస్తున్న తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ర్యాగింగ్‌ను నివారించడానికి కళాశాల కఠిన చర్యలు తీసుకుంటోందని, క్యాంపస్‌లో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.