📅 Wednesday, 04 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
27°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్య
‹
›
District News

రెండున్నరేళ్లుగా విధులకు దూరంగా ఉపాధ్యాయుడు!

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
రెండున్నరేళ్లుగా విధులకు దూరంగా ఉపాధ్యాయుడు!
  • వెంకటాపూర్ పాఠశాలకు వెంటనే మరో టీచర్‌ను కేటాయించాలి నిర్లక్ష్యం వీడకపోతే డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.ఎస్ ఎఫ్ ఐ ఏఐపిఎస్ యు హెచ్చరిక
నిర్మల్ నవంబర్ 4 సాక్షర ప్రతిని
నిర్మల్/ముధోల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై, పర్యవేక్షించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందని, అయితే కొందరి నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఎస్ఎఫ్ఐ ఏఐపిఎస్ యు విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ముధోల్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించాల్సిన ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు గత రెండున్నర సంవత్సరాలుగా విధులకు హాజరుకావడం లేదని వారు ఆరోపించారు.ఈ కారణంగా విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యాబోధన అందడం లేదని పేర్కొన్నారు. సదరు ఉపాధ్యాయుడి గైర్హాజరుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, పాఠశాలకు వెంటనే ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి దిగంబర్, ఏ ఐ పీ ఎస్ యు నిర్మల్ జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. రెండున్నరేళ్లుగా ఉపాధ్యాయుడు విధులకు దూరంగా ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.
ఈ విషయంపై స్థానిక మండల విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా, సదరు ఉపాధ్యాయుడికి జీతం రావడం లేదని, ఆయన సెలవులో ఉన్నారని సమాధానం ఇచ్చారని తెలిపారు. అయితే ఉపాధ్యాయుడికి జీతం వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే, రెండేళ్లకు పైగా విద్యార్థులకు బోధన అందకపోవడంపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు.రెండున్నరేళ్లుగా విధులకు హాజరుకావడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై సమగ్ర శాఖాపరమైన విచారణ జరిపి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలకు తక్షణమే ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై కేటాయించి విద్యాబోధనకు ఆటంకం లేకుండా చూడాలి.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని వారు కోరారు. సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే ఎస్ ఎఫ్ ఐ ఏఐపిఎస్ యు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఇరు విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.