📅 Wednesday, 04 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
27°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్య
‹
›
District News

5న నేడు గురువారం నగరం లో నీటి సరఫరా నిలిపివేత : నిజామాబాద్‌ నగరపాలక సంస్థ

◉ T PRAKASH RAO   |   ◷ Latest
  • పైపులైన్ మరమ్మతులతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్ 4 : అలీ సాగర్‌ ఫీడర్‌ పైపులైన్‌కు సంబంధించి రైల్వే కమాన్‌ వద్ద 500 ఎంఎం డయా ఎంఎస్‌ పైపులైన్‌ మరమ్మతు పనులు చేపడుతున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు నిజామాబాద్‌ నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు సమాచారం అందించారు.
మరమ్మతు పనుల కారణంగా నాందేవాడ, అమలవాడి, సుభాష్‌నగర్‌, ఆదర్శనగర్‌, గౌతమ్‌నగర్‌, దుబ్బ, ఖిల్లీ వాడి, ఎల్లమ్మగుట్ట, కంటేశ్వర్‌, చంద్రశేఖర్‌ కాలనీ, గంగాస్థాన్‌, ఇస్లాంపుర కాలనీ, అశోక్‌నగర్‌, వినాయకనగర్‌ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. పైపులైన్‌ మరమ్మతు పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.