- హెర్బల్ ధూప్ స్టిక్స్ తయారీ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం
జన్నారం సాక్షర మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చే సుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జన్నారం ఏపీఎం లలిత సూచించారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవల ప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆ ధ్వర్యంలో నిర్వహించిన ఏంఎస్ డిపి 158 హెర్బ ల్ ధూప్ స్టిక్స్ తయారీ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు బుధవారం రోజున మం డలకేంద్రంలోని వెలుగు కార్యాలయ ఆవరణలో శి క్షకురాలు జొన్నలక్ష్మి,ఏపీఎం లలిత, మండలమహి ళా సమాఖ్య అధ్యక్షురాలు వరలక్ష్మిల చేతుల మీ దుగా మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. అ నంతరం ఏపీఎం లలిత మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించుకొని మ హిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. హెర్బల్ ధూప్ స్టిక్స్, అగరబత్తులు, ఆవుపేడ ప్రమిదలు త దితర ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో మం చి గుర్తింపు పొందాలని తెలిపారు. మహిళలు త యారు చేసిన ఉత్పత్తుల విక్రయాలకు ఐకేపీ తర ఫున అవసరమైన సహకారం అందించడంతో పా టు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఈడీఐఐ ప్రాజెక్ట్ ఆఫీసర్ బుక్యా దేవేందర్ నాయక్, మాస్టర్ ట్రైనర్ అలేఖ్య, వివోఎలు ముల్కాల రవీందర్, రాథోడ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
— Kotha VenugopalDistrict Correspondent