📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

'పెన్షన్ల పండుగ' పేరుతో ప్రచార ఆర్భాటమే, మూడేళ్లుగా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకుండా కాలయాపన.. రూ. 4 వేల పెన్షన్, మహిళలకు 2500, తులం బంగారం ఏమైంది? -గణాంకాలు తప్పని నిరూపిస్తే రాజీనామాకు

◉ T PRAKASH RAO   |   ◷ Latest
 'పెన్షన్ల పండుగ' పేరుతో ప్రచార ఆర్భాటమే, మూడేళ్లుగా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకుండా కాలయాపన.. రూ. 4 వేల పెన్షన్, మహిళలకు 2500, తులం బంగారం ఏమైంది? 
-గణాంకాలు తప్పని నిరూపిస్తే రాజీనామాకు
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 'పెన్షన్ల పండుగ' పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలను మండలాలు, గ్రామాలకు పంపిస్తూ ప్రజలను మభ్యపెట్టే, మోసం చేసే కార్యక్రమాలకు పాల్పడుతోందని బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
'మూడేళ్లుగా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకుండా కాలయాపన.. రూ. 4 వేల పెన్షన్ హామీ, మహిళలకు 2500, తులం బంగారం ఏమైంది? గణాంకాలు తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం.. మంత్రులు సీతక్క, సుదర్శన్ రెడ్డి, పీసీసీ చీఫ్ సిద్ధమా? అని మాజి మం త్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సవాళ్ విసిరారు. బుధ వారం నిజామాబాదులో టిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవలం 3,424 మందికి అదనంగా పెన్షన్లు ఇస్తూ, 31 మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మీటింగ్‌లు పెట్టి 'పెన్షన్ల పండుగ' పేరుతో ప్రచార ఆర్భాటం చేయడం ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు. బెజ్జోర గ్రామంలో 22 పెన్షన్లు తొలగించి 13 మందికి ఇచ్చి పెన్షన్ల పండుగ పేరుతో ఫ్లెక్సీలు కట్టమనడం విడ్డూరమని అనారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ డేటా ప్రకారం, 2023 డిసెంబర్ నాటికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ జిల్లాలో 2,79,177 మందికి నెలకు రూ. 2,000 చొప్పున పెన్షన్ అందేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరణాలు, ఇతర కారణాలతో 17,131 మందిని పెన్షన్ జాబితా నుండి తొలగించి, ఇప్పుడు కొత్తగా 20,555 మందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు.
జిల్లాలో ఇదివరకే ఉన్న 2,79,177 పెన్షన్ లబ్డిదారులకు 4000 పెన్షన్ హామీలో ఒక్కొక్కరి కి 72,000 రూపాయల బాకీ , ఆడబిడ్డలకు రూ. 90 వేల మహాలక్ష్మి బాకీ చెల్లించినాక, తులం బంగారం ఇచ్చాకే గ్రామాల్లోకి రండి...మంత్రులకు, ఎమ్మెల్యే వేముల సవాల్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 3.20 లక్షల మంది వృద్దులు, బీడీ కార్మికులు, మహిళలు కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ హామీలు, బకాయిలన్నీ చెల్లించకుండా కేవలం చనిపోయిన వారి స్థానంలో కొద్దిమందికి పెన్షన్లు ఇస్తూ పండుగ పేరుతో సమావేశాలు నిర్వహిస్తే జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క, మంత్రి అని చెప్పుకుంటున్న సుదర్శన్ రెడ్డి మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలే ఎక్కడికక్కడ నిలదీసి తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో బాజిరెడ్డి జగన్,నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ AMC చైర్మన్ దొంకంటి నర్సయ్య,మాజీ ఎంపిపి ఆర్మూర్ మహేష్, ,దండు శేఖర్, సుజిత్ సింగ్ ఠాకూర్,సత్య ప్రకాష్,సిర్ప రాజు,నవీద్, డోళ్ళ రాజేశ్వర్, ఏనుగు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.