- బెల్లంపల్లి ఏరియా జిఎం ఎం.శ్రీరమేష్.
రెబ్బెన,సాక్షర:పరాయి పాలకుల చేతిలో ముక్కలైన దేశాన్ని అఖండ భారతంగా ఏకం చేసిన ధైర్యశాలి,ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీరమేష్ అన్నారు.శనివారం గోలేటిలోని బెల్లంపల్లి ఏరియా జిఎం కార్యాలయ ఆవరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవాన్ని నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిఎం వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమైక్యత,ఐక్యత కోసం పటేల్ చేసిన కృషి తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగులకు వివరించారు.నేడు తెలంగాణ,జమ్ముకాశ్మీర్ లాంటి అతిపెద్ద సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేసిన ఘనత పటేల్ గారిదన్నారు.భారత రాజ్యాంగ రచనలో అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి ఛైర్మెన్‌గా వ్యవహరించాడని పేర్కొన్నారు.మహానుభావుల ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత దేశ పౌరులుగా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.అనంతరం ఉద్యోగులతో కలిసి ఐక్యత ప్రతిజ్ఞ చేసారు.ఈ కార్యక్రమంలో ఏఐటియూసి నాయకుడు జూపాక రాజేష్,ఏరియా ఇంజినీర్ అధికారుల సంఘం కార్యదర్శి వీరన్న,డిజిఎం పర్సనల్ దేవరకొండ కిరణ్ బాబు,ఎస్ఓ టు జిఎం స్వామి రాజు,సీనియర్ పర్సనల్ అధికారి డి.ప్రశాంత్ వివిధ విభాగాల అధిపతులు,జిఎం కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER