చెన్నూరులో ఘనంగా జాతీయ లోక్ అదాలత్
- 86 కేసులు రాజీ మార్గంలో పరిష్కారం జూనియర్ సివిల్ జడ్జి పి. రవి
చెన్నూరు సాక్షర :
చెన్నూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌కు కక్షిదారుల నుండి విశేష స్పందన లభించింది. జూనియర్ సివిల్ జడ్జి పి. రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 86 కేసులురాజీమార్గంలోపరిష్కారమయ్యాయి.ఈ సందర్భంగా న్యాయమూర్తిపి.రవిమాట్లాడుతూలోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకోవడం వల్ల కక్షిదారులకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఇరువర్గాల అంగీకారంతో పరిష్కారమయ్యే తీర్పులకు అప్పీలు ఉండదని, దీనివల్ల ఇరువురి మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు ఎస్. రమేష్, రాజశేఖర్, నవాజ్, లక్ష్మణ్, మమత, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
