📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

వరంగల్ హైవే భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించాలి

◉ Kodishetti Sathish   |   ◷ Latest
వరంగల్ హైవే భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించాలి
  • రోడ్డు పనులను అడ్డుకుని భూనిర్వాసితుల ధర్నా
చెన్నూరు సాక్షర :
జైపూర్ వరంగల్ హైవే నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందకపోవడంతో భూనిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. జైపూర్ మండలంలోని వరంగల్ హైవే లో భూమి కోల్పోయిన బాధిత రైతులు ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు.హైవే నిర్మాణం కోసం తమ విలువైన భూములను కోల్పోయినప్పటికీ, సంబంధిత అధికారులు ఇప్పటివరకు పరిహారం చెల్లించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయి జీవనాధారం దూరమైన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూములు సేకరించిన వెంటనే నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ జాప్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనితెలిపారుఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయమైన పరిహారం వెంటనే చెల్లించాలని భూనిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.