📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
31°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ నేతల విజయదశమి శుభాకాంక్షలు
‹
›
District News

కొల్లూరులో అమ్మవారి నవరాత్రి శోభాయాత్ర వైభవం

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
కొల్లూరులో అమ్మవారి నవరాత్రి శోభాయాత్ర వైభవం
  • డీజే సప్పుళ్లు.. శివసత్తుల ఆటలతో హోరెత్తిన గ్రామం
  • GNM యూత్, మాజీ ఎంపీటీసీ గడుగు నరసింహులు, రాందాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు గ్రామంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. GNM యూత్, మాజీ ఎంపీటీసీ గడుగు నరసింహులు, రాందాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీజే సప్పుళ్లు, శివసత్తుల ఆటపాటలతో గ్రామమంతా సందడిగా మారింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ ప్రజల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో PAC వైస్ చైర్మన్ మధు, గడుగు వెంకటేష్, సునీల్, ప్రశాంత్, GNM యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.