📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
31°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS కొల్లూరులో అమ్మవారి నవరాత్రి శోభాయాత్ర వైభవం
‹
›
District News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
  • మల్లికార్జున నగర్ కాలనీలో అభివృద్ధి పనులపై సమీక్షించిన తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్
  • రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.30 లక్షలతో రిటైనింగ్ వాల్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచన
రామచంద్రపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని రామచంద్రపురం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ హామీ ఇచ్చారు. డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో అభివృద్ధి పనుల పురోగతిపై కాలనీ వాసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కాలనీ వాసులకు ఇచ్చిన హామీ మేరకు రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, రూ.30 లక్షల వ్యయంతో శ్రీకృష్ణ ఆలయం వద్ద నాలా చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులను కోరారు. ఈ పనులకు సంబంధించి అధికారులతో, కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా పుష్పనగేష్ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.