కృష్ణారెడ్డి పెట్ లో ఘనంగా అయ్యప్ప స్వామి పాదయాత్ర ప్రారంభం
- పాదయాత్రను ప్రారంభించిన అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి
అమీన్‌పూర్: బీరంగూడ డివిజన్ పరిధిలోని పటేల్‌గూడలో అయ్యప్ప స్వామి భక్తులు చేపట్టిన పాదయాత్రను అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ప్రారంభించారు. అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్యాత్మిక భక్తి, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలిచే పాదయాత్రను ప్రారంభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి పాదయాత్ర భక్తి శ్రద్ధలతో విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
