- నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు.. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు హెచ్చరిక సొన్ సబ్ ఇన్స్పెక్టర్ కంభంపాటి గోపి
నిర్మల్ నవంబర్ 15 సాక్షర ప్రతినిధి రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల భద్రతే లక్ష్యంగా సొన్ సబ్ ఇన్స్పెక్టర్ కంభంపాటి గోపి ఆధ్వర్యంలో పోలీసులు కడ్తాల్ గ్రామ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిని గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని పోలీసులు ప్రజలకు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer
Advertisement