సైబర్ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం
- భారత ప్రభుత్వ నిధులు, ఐఐటీ రూర్కీ సహకారంతో నిర్వహణ
'సైబర్ సెక్యూరిటీ కోసం పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీ, ప్రామాణీకరణ, కృత్రిమ మేధస్సు' అనే అంశంపై ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 5జీ, 6జీ నెట్‌వర్క్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్ కారణంగా ఉత్పన్నమవుతున్న సైబర్ భద్రతా సవాళ్లను ఎదుర్కొనే దిశగా ఈ శిక్షణ ఉపయోగపడనుంది.
ఈ కార్యక్రమంలో ఆధునిక క్రిప్టోగ్రఫీ, పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రాఫిక్ అల్గారిథంలు, సురక్షిత సమాచార మార్పిడి, వైర్‌లెస్ ప్రామాణీకరణ, ఏఐ ఆధారిత ముప్పుల గుర్తింపు వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. నిపుణుల ఉపన్యాసాలు, సాంకేతిక చర్చలు, ప్రయోగాత్మక శిక్షణ ద్వారా పాల్గొనేవారికి ఆధునిక సైబర్ సెక్యూరిటీ పరిజ్ఞానాన్ని అందించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఐఐటీ రూర్కీకి చెందిన డాక్టర్ రాఘవేంద్ర సింగ్ రోహిత్, ప్రొఫెసర్ మనోజ్ మిశ్రా, ప్రొఫెసర్ సుగతా గంగోపాధ్యాయ, ఐఐటీ జమ్మూకు చెందిన డాక్టర్ భూపేంద్ర సింగ్, ఐఐటీ బీహెచ్‌యూకు చెందిన డాక్టర్ అవనీష్ కుమార్ యాదవ్ తదితర ప్రముఖ నిపుణులు వక్తలుగా పాల్గొననున్నారు.
ఏఐసీటీఈ, యూజీసీ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తదితర అనుబంధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి, నిర్ణీత హాజరు, మూల్యాంకనం, ప్రయోగాత్మక కార్యకలాపాల నిబంధనలు పాటించిన వారికి ధ్రువపత్రాలు అందజేయనున్నారు.
ఆసక్తి గలవారు రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం డాక్టర్ సహన డి.ఎస్.ను 9886957788 నంబర్‌లో లేదా ssanthos@gitam.edu ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.
