📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఈ నెల 16న ప్రత్యేక పిల్లల ప్రజావాణి నిర్వహణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

హలో నేతకాని – చలో ఉస్మానియా గోడప్రతుల విడుదల

◉ Kotha Venugopal   |   ◷ Latest
హలో నేతకాని – చలో ఉస్మానియా గోడప్రతుల విడుదల
జన్నారం సాక్షర
ఈనెల 15 న రాష్ట్ర రాజదానిలో జరగనున్న హలో నేతకాని చలో హైదరాబాద్ కార్యక్రమ గోడ ప్రతులను మండల నేతకాని సంఘం అద్వర్యంలో విడుదల చేశారు. గురువారం రోజున స్థానిక డా; బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం నాయకులు హలో నేతకాని చలో హైదరాబాద్ గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్బంగా నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, TNMVS OUJAC ప్రోగ్రాం కన్వీనర్ సాయిని ప్రసాద్ నేత మాట్లాడుతూ సమాజంలో ఎన్ని వర్గీకరణలు చేసిన ఎన్ని సర్వేలు చేసిన నేతకాని కులస్తులకు ఎటువంటి న్యాయం జరగడం లేదని మన హక్కులు మన సమాజం అబివృద్ది కొరకు మనం కదం తోక్కవలసిన సమయం ఆసన్నం అయిందని అందుకోరకే ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో నేతకాని కులస్తులు హాజరు కావాలని మన సంఘటిథాన్ని చాటాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం డైరెక్టర్ తాళ్లపల్లి రాజేశ్వర్ ప్రోగ్రాం వైస్ చైర్మన్ బోర్లగుంట ప్రభుదాస్ ప్రోగ్రాం కో కన్వీనర్ జాడి గంగాధర్, నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం వినోద్ కుమార్, మండల అధ్యక్షులు రత్నం లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు దుర్గం వసంత్ సీనియర్ నాయకులు కుకటికారి బుచ్చయ్య, దుర్గం లక్ష్మీరాజాం, జునుగురి మల్లయ్య, దుర్గం నందయ్య, రత్నం మాణిక్యం, వినయ్ భాస్కర్ బెంబడి భాస్కర్, దత్తు తదితర నేతకాని నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.