📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఈ నెల 16న ప్రత్యేక పిల్లల ప్రజావాణి నిర్వహణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం
పటాన్‌చెరు: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం, బీబీఏ ప్రథమ సంవత్సరం నూతన విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం కళాశాలలో కామర్స్, మేనేజ్‌మెంట్ విభాగాల సీనియర్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, అధ్యాపకులు మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు సంప్రదాయ విద్యతో పాటు డిజిటల్ ఆధారిత నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు స్టార్టప్‌ల స్థాపనలోనూ నైపుణ్యం సాధించాలని అన్నారు. లక్ష్యంపై ఇష్టంతో కృషి చేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు చేసిన ప్రేరణాత్మక ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, ఫ్యాషన్ వాక్‌తో పాటు వివిధ పోటీలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పూనంకుమారి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. సుజాత, కామర్స్ విభాగాధిపతి షరీఫ్ మియా, డాక్టర్ మంజశ్రీ, డాక్టర్ బేబీ రమణి, కరుణకుమారి, డాక్టర్ వెంకటేశం, కామర్స్–మేనేజ్‌మెంట్ అధ్యాపకులు స్వప్న, సభా కానం, ఉమాదేవి, నందిని, బోధనేతర సిబ్బంది శివరాజు, అరుణ్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.