📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం
‹
›
District News

ఈ నెల 16న ప్రత్యేక పిల్లల ప్రజావాణి నిర్వహణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

◉ Kotha Venugopal   |   ◷ Latest
ఈ నెల 16న ప్రత్యేక పిల్లల ప్రజావాణి నిర్వహణ  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల సాక్షర
తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీన (సాధారణ ప్రజావాణితో పాటు) ప్రత్యేకంగా “పిల్లల ప్రజావాణి” కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక పిల్లల ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బాలలకు సంబంధించిన వ్యక్తిగత, సామాజిక సమస్యలు, ఇబ్బందులు, ఇతర ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు సద్వినియోగం చేసుకొని, పిల్లలకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులను ప్రజావాణి కార్యక్రమంలో తెలియజేయవచ్చని వివరించారు.