📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

వేదిక్ పాఠశాల చిన్నారి సహస్రకు నంది అవార్డు.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
వేదిక్ పాఠశాల చిన్నారి సహస్రకు నంది అవార్డు.
  • కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న బాలిక.. నాట్య మంజరి ప్రశంసాపత్రం అందజేత.
నిర్మల్ నవంబర్ 15 సాక్షర ప్రతినిధి
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 15, ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సిరిఅర్త్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నిర్మల్‌కు చెందిన చిన్నారి మామిళ్ళ సహస్ర తన కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తన నృత్య ప్రతిభతో అందరినీ అలరించిన సహస్రకు నిర్వాహకులు నాట్య మంజరి ప్రశంసాపత్రంతో పాటు నంది అవార్డును ప్రదానం చేశారు.మామిళ్ళ లింగయ్య, ఉమాదేవి సంజన దంపతుల కుమార్తె సహస్ర ప్రస్తుతం కడ్తాల్‌లోని వేదిక్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. చిన్న వయసులోనే నృత్యంపై ఆసక్తి పెంచుకున్న సహస్ర నాలుగేళ్ల వయసుగల సహస్ర పలువురు అభినందించారు.
శిక్షణ ప్రారంభించిన నాటి నుంచి పలు సాంస్కృతిక వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇస్తూ తన ప్రతిభను చాటుకుంటోంది. చిన్న వయసులోనే అవార్డు అందుకోవడంతో కుటుంబ సభ్యులు, గురువులు ఆనందం వ్యక్తం చేశారు. సహస్రకు పలువురు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.