📅 Monday, 26 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS చెన్నూరులో సుందరీకరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం
‹
›
District News

మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం
  • నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు.పాల్గొన్నఅడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం
నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలునిర్మల్, అక్టోబర్ 26 (సాక్షర ప్రతినిధి):ఆదికవి మహర్షి వాల్మీకి సాహిత్య సేవలను స్మరించుకుంటూ నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి సంస్కృత సాహిత్యంలో ఆదికవిగా విశిష్ట స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన రచించిన రామాయణం ధర్మం, సత్యం, న్యాయం, మానవత్వం వంటి గొప్ప విలువలను ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. రామాయణంలోని ఆదర్శాలు నేటి సమాజానికి సైతం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.మహర్షి వాల్మీకి రచనలు మానవ జీవితానికి నైతిక మార్గదర్శకత్వాన్ని అందిస్తాయని, ఆయన సాహిత్య సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ధర్మబద్ధమైన జీవనం, క్రమశిక్షణ, పరస్పర గౌరవం, సామాజిక సామరస్యం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ అధికారి నర్సమ్మ, ఆర్‌ఐలు రామనిరంజన్, శేఖర్, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, ఐటీ కోర్ సిబ్బంది, డీసీఆర్‌బీ, ఫింగర్‌ప్రింట్, కమ్యూనికేషన్ విభాగాల సిబ్బంది, జిల్లా పోలీస్ పరిపాలనా విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.