📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

నేడు కలెక్టరేట్ లో "బాలల ప్రజావాణి": కలెక్టర్ ఇలా త్రిపాఠి

◉ T PRAKASH RAO   |   ◷ Latest
నేడు కలెక్టరేట్ లో "బాలల  ప్రజావాణి": కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • బాలల హక్కుల వారోత్సవంను పురస్కరించుకుని
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర, నవంబర్ 15 : బాలల హక్కుల వారోత్సవంను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఈ నెల 16న ప్రత్యేకంగా బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రతి సోమవారం యధావిధిగా కొనసాగే ప్రజావాణితో పాటే 16న బాలల ప్రజావాణి కొనసాగుతుందని అన్నారు. ప్రత్యేక బాలల ప్రజావాణిలో బాలబాలికలు విద్య, వైద్యం, రవాణా, సంక్షేమం తదితర సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయవచ్చని సూచించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులచే సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. బాలల ప్రజావాణికి వచ్చే పిల్లల సౌకర్యార్థం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయిస్తున్నామని అన్నారు.