ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి సారంగాపూర్ కాంగ్రెస్ శ్రేణుల పయనం
- సర్పంచులు, కాంగ్రెస్ నాయకులతో ఢిల్లీకి ప్రత్యేక బస్సు.. జెండా ఊపి ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్
ఢిల్లీలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'ఓటు బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సారంగాపూర్ మండల కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరాయి. ఈ సందర్భంగా మండల కేంద్రం నుంచి సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక బస్సులో ఢిల్లీకి పయనమయ్యారు. బస్సు ప్రయాణాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు ప్రాధాన్యత, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని నాయకులు పేర్కొన్నారు.
ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో సారంగాపూర్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నట్లు తెలిపారు. పార్టీ పిలుపు మేరకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
