📅 Saturday, 14 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం
‹
›
District News

సాక్షర కథనానికి స్పందన.. నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ నాయకుల నివాళులు!

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
రామచంద్రపురం: భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా రామచంద్రపురంలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించకపోవడంపై ప్రచురితమైన సాక్షర కథనానికి నాయకులు స్పందించారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న నెహ్రూ విగ్రహం వద్ద జయంతి రోజున కాంగ్రెస్ నాయకులు కనిపించకపోవడం, విగ్రహానికి పూలమాలలు వేసే వారు లేకపోవడంపై సాక్షర పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన కాంగ్రెస్ నాయకులు నెహ్రూ విగ్రహం వద్దకు చేరుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయంతి సందర్భంగా చోటుచేసుకున్న నిర్లక్ష్యంపై వచ్చిన కథనం తమ దృష్టికి రావడంతో స్పందించి నివాళులు అర్పించినట్లు తెలిపారు. ఏదేమైనా, పత్రికా కథనానికి స్పందించి నాయకులు ముందుకు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలను, నాయకుల నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో పత్రికల పాత్ర మరోసారి స్పష్టమైంది.