📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

ఇందిరమ్మ ఇంటిలో ఆనందాల కాంతులు..

◉ M VIJAYA   |   ◷ Latest
ఇందిరమ్మ ఇంటిలో ఆనందాల కాంతులు..
రెబ్బెన,సాక్షర:మండలంలోని వంకులం గ్రామ పంచాయతీలోని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు గజానంద్-సురేఖ దంపతులు తమ సొంత ఇంటి కల నెరవేరిన వేళ శుక్రవారం వారిని కాంగ్రెస్ నాయకులు శాలువా కప్పి సన్మానించారు.సొంత ఇంటికి యజమానులను చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు సురేఖ గజనంద్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ నాయకులతో కలిసి లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొమరం భీం జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు విశ్వ ప్రసాద్ రావు లబ్ధిదారులు సురేఖ-గజనంద్ దంపతులకు నూతన వస్త్రాలను అందించి,శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ లావుడ్యా రమేష్,రెబ్బెన టౌన్ మాజీ అధ్యక్షులు వనమాల మురళీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.