📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
  • సోన్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి మిఠాయిల పంపిణీ
నిర్మల్ నవంబర్ 8 సాక్షర ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం సోన్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొయినుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు గడ్డం స్వామి, అజహర్, ఆత్మ డైరెక్టర్ చిలారి సాయి కుమార్, ఎస్సీ మండల అధ్యక్షుడు అనిల్, ప్రేమ్, గంజల్ సర్పంచ్ వెంకట రమణ, ఉప సర్పంచ్ మహేందర్, మాజీ ఉప సర్పంచ్ దాసరి రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ లింగన్న, మహ్మద్ అబూద్, మాజీ వార్డు సభ్యులు నవకాంత్, ఆరే రాము, బొడ్డు లక్ష్మణ్, షేక్ సమీఉద్దీన్, పెద్ద ముత్తన్న, చింతకింది గంగాధర్, ప్రవీణ్, ఇలియాస్ బిన్ అహ్మద్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ అవైస్, అబుబకర్, మహమ్మద్ అర్బాజ్, షేక్ ముసేఫ్ తదితరులు పాల్గొన్నారు.