📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
21°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ గా రామస్వామి..

◉ M VIJAYA   |   ◷ Latest
ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ గా రామస్వామి..
  • కే.రామస్వామి నమస్తే తెలంగాణ రెబ్బెన జర్నలిస్ట్.
రెబ్బెన,సాక్షర:ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయు)జాతీయ కౌన్సిల్ సభ్యునిగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ కుర్సింగ రామస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్టేట్ చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ గొర్ల బుచ్చన్న ప్రకటించారు.మూడు సంవత్సరాల కాలపరిమితి గల ఈ పదవికి ఏకగ్రీవం కావడం జరిగిందని తెలిపారు.నూతనంగా జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన కుర్సింగ రామ స్వామి మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం,సమస్యల పరిష్కారం కోసం అందరి సహకారంతో కృషి చేస్తానని అన్నారు.ఐజేయు జాతీయ స్థాయిలో సముచిత స్థానం కల్పించడంలో సహకరించి అవకాశం కల్పించిన టీయూడబ్ల్యూజే (హెచ్ -143)రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ,ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతీ సాగర్,యూనియన్ అడ్వైజర్,మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్,కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ భుక్య రవి నాయక్,రాష్ట్ర నాయకులు తిరుపతి నాయక్, యోగానంద్,భాస్కర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.