📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు సేవలు చేసే ఏకైక సంస్థ వాసవిక్లబ్స్ ఇంటర్నేషనల్

◉ Kodishetti Sathish   |   ◷ Latest
గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు సేవలు చేసే ఏకైక సంస్థ వాసవిక్లబ్స్ ఇంటర్నేషనల్
  • వాసవిక్లబ్స్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు పాత సుదర్శన్
మంచిర్యాల సాక్షర : గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో నిరుపేదలకు అండగా నిలుస్తు సేవా కార్యక్రమాలను నిరాటంకంగా ఇంటర్నేషనల్ వాసవిక్లబ్స్ నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ వాసవిక్లబ్స్ మాజీ అధ్యక్షుడు, కార్యాలయ మెంబర్షిప్ గ్రోత్ ఛైర్మన్ పాత సుదర్శన్ అన్నారు. ఆదివారం రాత్రి మంచిర్యాల శ్రీనివాస గార్డెన్ పుల్లూరీస్ 9వ డిస్టిక్ డిస్కాన్ కార్యక్రమం జిల్లా 107 గవర్నర్ పుల్లూరి బాలమోహన్ఆధ్వర్యంలో జరుగగా ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా 107 పరిధిలో మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలోని 47 వాసవిక్లబ్స్ తమ వంతు సేవా కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నాయని అభినందించారు. వాసవిక్లబ్స్ బాధ్యులు నిరుపేదలకు అందడగా నిలుస్తుంటే వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా సభ్యులలో అనుకోకుండా మరణించిన పేదల కోసం మహాప్రస్తానం ద్వారా 25 వేల ఆర్థిక సాయం, నిరుపేదల అడపిల్ల పెళ్ళికి 25 వేల కళ్యాణలక్ష్మి ఆర్థిక సాయం, చిరువ్యాపారులకు వడ్డి లేని 25 వేల రుణ సదుపాయం, సరస్వతి పథకం ద్వారా నిరుపేద విద్యార్థులకు లక్ష నోటు పుస్తకాలను అందజేశామని గుర్తుచేశారు. వీటితో పాటు అవసరము ఉన్న చోట పర్మినెంటు ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో నిస్వార్థంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సంవత్సరం పాటు సేవలను అందించిన వాసవిక్లబ్ల సభ్యులు ఉత్తమ అవార్డులను అందజేశారు. అలాగే 2027 సంవత్సరం నూతన గవర్నర్గా ఎన్నికైన పబ్బ అరుణ తన క్యాబినెట్ టీంతో ప్రమాణస్వీకారంను ప్రస్తుత గవర్నర్ బాల మోహన్ చేయించారు. ఈ డిస్కాన్ కార్యక్రమంలో అంతర్జాతీయ అబ్జర్వర్ సుగ్గుల ప్రసన్నకుమార్, కాన్ఫరెన్స్ ఛైర్మన్ ముక్తా శ్రీనివాస్, ఎన్నికల అధికారి కొండ చంద్రశేఖర్, ఇంటర్నేషనల్ అధికారులు సిరిపురం రాజేశ్, రేణికుంట్ల శ్రీనివాస్, సిరిపురం సత్యనారాయణ, ఎకిరాల శ్రీనివాస్, కలికోట శ్రీనివాస్, బాల సంతోష్, జంధ్యం మాధవి, జిల్లా గవర్నర్ పుల్లూరి అరుణ బాలమోహన్, క్యాబినెట్ అధికారులు ఎల్లంకి ప్రదీప్, కేశెట్టి వంశీకృష్ణ, కొంకుముట్టి వెంకటేశ్, వుత్తూరి రమేష్, రీజియన్ ఛైర్మన్, జోన్ ఛైర్మన్లు, జిల్లా అధికారులు, అన్ని వాసవిక్లబ్ల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు వాసవిక్లబ్ సభ్యులు పాల్గొన్నారు.