📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఏం బి బి ఎస్ సాదించిన విద్యార్థికి సన్మానం
‹
›
District News

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

◉ Kodishetti Sathish   |   ◷ Latest
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి 

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు సాక్షర : భీమారం
ప్రజా సంక్షేమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో గల సమత రైస్ మిల్ ను అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లుకు కేటాయించిన వరి ధాన్యం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని, సి.ఎం.ఆర్. ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. మండలంలోని మద్దికల్ గ్రామాన్ని ఉప తహసిల్దార్ అంజమ్మ తో కలిసి సందర్శించి గ్రామంలో చేపట్టే రీ సర్వే ప్రక్రియను ఉదయం సమయంలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగుల హాజరు పట్టిక, భూభారతి దరఖాస్తుల పరిశీలన, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణ అంశాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. భూభారతి దరఖాస్తులను రికార్డులతో సరిచూసి నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని తెలిపారు.
మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పాఠశాలలోని స్టోర్ గది, వంటగదిని తనిఖీ చేసి, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. దసరా సెలవుల అనంతరం పాఠశాల పునః ప్రారంభమైనందున పాఠశాలను శుభ్రపరచాలని, విద్యార్థినులకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, ఇతర వైద్య సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.