- రెబ్బెనలో కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.
రెబ్బెన,సాక్షర:మండల కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.టపాసులు కాల్చి,కేక్ కట్ చేసి,స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లడుతూ భారాస తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో తెలంగాణను 8లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్తే కష్టకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు,రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణ మాఫీ,మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది పనులు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సమర్థవంతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు.కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ లావుడ్య రమేష్,రెబ్బెన మాజీ ఎంపీటీసీ సభ్యులు పెసరి మధునయ్య,మాజీ జడ్పీటీసీ సభ్యులు దుర్గం సోమయ్య,కాంగ్రెస్ సీనియర్ నేత,గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు మోడెం సుదర్శన గౌడ్,మాజీ సర్పంచ్ గంటుమేర,జిల్లా కార్యదర్శి దుర్గం దేవాజీ,నాయకులు మోడెం రాజేంద్ర ప్రసాద్ గౌడ్,మాజీ కో ఆప్స్షన్ సభ్యులు జహోరోద్దీన్,గొడిసెల వెంకటేశ్వర గౌడ్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు జహీర్ భాయ్,కిసాన్ సెల్ మండలాధ్యక్షులు సుబ్బారావు,డైరెక్టర్ బొంగు నర్సింగరావు,ఉప అధ్యక్షులు జమీర్,ముజామిల్ భాయ్,స్పాక్స్ పర్సన్ వాడై నగేష్,మోడెం రాజా గౌడ్,వార్డు సభ్యులు భార్గవ్ గౌడ్,యువ నాయకులు సోనాలె సంతోష్ బాబు,ఉప అధ్యక్షులు గొగర్ల శ్రీనివాస్,గొడిసెల విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER