ఎల్ నినోను ప్రకృతి మిత్రులుగా మారి ఎదుర్కొదాం
- ప్రకృతిమిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు, ప్రభుత్వ పర్యావరణ వేత్త గుండేటి యోగేశ్వర్
ఎ ల్ నినో నుప్రకృతి మిత్రులుగా మారి ఎదుర్కొదాం అని ప్రకృతిమిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు, ప్రభుత్వ పర్యావరణ వేత్త గుండేటి యోగేశ్వర్ పిలుపు నిచ్చారు .ప్రతి నీటి బొట్టును రేపటి కోసం దాచుకోవాలని, ఆర్.ఓ ప్లాంటు నీటిని అవసరాలకువాడుకోవాలని విద్యార్థులు ప్రకృతిమిత్రఅలవాట్లు పెంచుకోవాలని పాఠశాల ఆవరణలో మొక్క నాటి స్పూర్తి నిచ్చిన ప్రకృతిమిత్ర అన్నారు. నేడు భారతదేశంలో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఎదుర్కొంటున్న ఎ ల్ ని నో వాతావరణ మార్పుల ప్రభావం, జల వనరుల రక్షణ, ప్రకృతి మిత్ర అలవాట్లు గురించి అవగాహన కలిగించేందుకు ప్రకృతి మిత్ర తెలంగాణ, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉప్పల్ మండలం, నాగోల్ లోని పి ఎం . శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న ఎ ల్ నీ నో వాతావరణ మార్పులు కారణాలు. మానవ బాధ్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకృతిమిత్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ వాల్టా అథారిటీ ప్రభుత్వ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ నాగోల్ మున్సిపల్ కమిషనర్ సంపత్ పాల్గొని అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానవుడు చేసే తప్పిదాల వలన వ్యాప్తంగా భూతాపం పెరిగి అమెరికా దక్షిణాసి యా భూమధ్యరేఖ వద్ద ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అతిగా పెరగటం తో సూపర్ ఎల్ నినో గా మారిందని దానికి కారణం కేవలం మానవుని యొక్క దుష్ట చర్యలుకావడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం, వివిధ పర్యావరణ చట్టాలు, నీరు.. చెట్టు.. నేల వాల్టా చట్టం ప్రకారం ప్రకృతి మిత్రులుగా మారాలని పిలుపునిచ్చారు. విద్యార్థులతో పాటు అన్ని రకాల ప్రజలు ప్రస్తుత వర్షాల పరిస్థితి, నీటి లభ్యత పరిస్థితులను అర్ధం చేసుకొని నీటిని చాలా పొదుపుగా వృధా చేయకుండా వినియోగించుకోవాలని, ప్రతి ఇంటింటా వర్షం నీటిని ఒడిసి పట్టే ఇంకుడగుంతలునిర్మించుకోవాలని సూచించారు. ప్రకృతి మిత్రులుగా మారాలని పేర్కొన్నారు. ఇంటి లోని ఆర్.ఓ ప్లాంట్ నీటిని ఇతర అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ సందర్భాల్లో నీటిని వృధా కాకుండా పొదుపుగా వాడి దాచు కోవాలన్నారు. ఈ సందర్భంగా ఎలినినోపై అవగాహన కలిగించే ప్రత్యేక పోస్టర్లనుఆవిష్కరించారు.. ప్రకృతి రక్షణలో ప్రతిభ కనబరిచిన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా ప్రకృతిమిత సభ్యులతో కలిసి ప్రతిజ్ఞ చేసారు. పాఠశాల ఆవరణలో పచ్చని మొక్కలునాటారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల పూర్వ అధికారి మెరుగు భూమయ్య, ఇన్చార్జి హెచ్.ఎం. ఎం.సుధాకర్, జిల్లా విశ్రాంత పరిశ్రమల అధికారి పద్మభూషణ్ రాజు, సివిల్ ఇంజనీర్ మాటేటి లక్ష్మీ నారాయణ, ప్రకృతి మిత్ర మహిళ కార్యదర్శి ఏం. విజయలక్ష్మి రాజు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో "ఎల్ నినో " ప్రకృతి ని రక్షించేందుకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వనరులను పొదుపుగా వాడుకోవాలన్నారు. వివిధ శుభ అశుభ, సందర్భాల్లో మొక్కలు నాటి వృక్షాలుగా ఎదిగేలా రక్షించాలని కోరారు. పాఠశాల గ్రీన్ క్లబ్ విద్యార్థి ఆదర్శ్ ప్రకృతి పాటలతో, సాయి నిధి చక్కని సందేశంతో అలరింపచేశారు.. బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులో ప్రకృతిమిత్ర ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్. ఏం ఉపాధ్యాయులు ప్రకృతిమిత్ర సభ్యులను అభినందించారు. సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు. శంకర్, రాజవర్ధన్, జయప్రద, పద్మ, కవిత సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
