📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

సోన్ గ్రామములో శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
సోన్ గ్రామములో శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు
  • భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు.. అనంతరం అన్నదానం
నిర్మల్ నవంబర్ 21 సాక్షర ప్రతినిధి
సోన్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతంలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలనీ వ్యవస్థాపకులు సదానందు స్వామి భక్తులకు తెలియజేసినారు.కార్తీక మాసంలోని పవిత్రమైన సోమవారం, పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు,అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కార్యక్రమ, ఆలయవ్యవస్థాపకులు సదానందు స్వామి తెలిపారు.ఈ సందర్భంగా భక్తులందరూ భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. వ్రతంలో దంపతులుగా కూర్చొని పూజలు
నిర్వహించదలచిన భక్తులు ముందుగా తమ పేర్లను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.కార్తీక మాస పవిత్రతను చాటుతూ ఆధ్యాత్మిక భావన, భక్తి, సేవాభావంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సదానందు స్వామి కోరారు.
వ్రతంలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా నిర్వాహకులను సంప్రదించి తమ పేర్లు తెలియజేయగలరు.