📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించాలి..

◉ M VIJAYA   |   ◷ Latest
పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించాలి..
  • కార్పొరేట్ ఎడ్యుకేషన్ జిఎం రాజేంద్రప్రసాద్.
రెబ్బెన,సాక్షర:బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కార్పోరేట్ ఎడ్యుకేషన్ జిఎం జి.రాజేంద్రప్రసాద్ అన్నారు.సోమవారం గోలేటి టౌన్షిప్ సింగరేణి ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన పాఠశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.గత ఏడాది ఫలితాలను పరిశీలించిన జిఎం పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.అనంతరం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పాఠశాల విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ డీజీఎం(పర్సనల్),డి.కిరణ్ బాబు,ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు బాబు నాయక్,ప్రైమరీ హెచ్ఎం ఆర్ల రెడ్డి,వ్యాయామ ఉపాధ్యాయులు కే.భాస్కర్ తోపాటు ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.