టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు దసరా శుభాకాంక్షలు
- మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన పటాన్‌చెరు కాంగ్రెస్ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను పటాన్‌చెరు కాంగ్రెస్ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహేష్ కుమార్ గౌడ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. పండుగ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు.
