📅 Monday, 26 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
30°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు దసరా శుభాకాంక్షలు
‹
›
District News

ఇందూరు స్వాములందరు ఎంతో నిష్ఠ తో శబరిమలకు మహా పాదయాత్ర దైవనిర్ణయం

◉ T PRAKASH RAO   |   ◷ Latest
ఇందూరు స్వాములందరు ఎంతో నిష్ఠ తో  శబరిమలకు మహా పాదయాత్ర దైవనిర్ణయం
  • అయ్యప్ప ఆలయంలో మహా పాదయాత్ర ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి,అక్టోబర్ 26: ఇందూరు నుండి స్వాములందరు ఎంతో నిష్ఠ తో శబరిమలకు పాదయాత్రగా వెళ్లడం అనేది దైవ నిర్ణయం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఇందూరు శ్రీధర్మశాస్త్ర పాదయాత్రను సోమవారం నగరంలోని అయ్యప్ప ఆలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహా పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములందరికి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. మొత్తం 40 మంది స్వాములు సుమారు 45 రోజులపాటు పాదయాత్రగా శబరిమల చేరుకుంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. అయ్యప్ప మాల ఎంతో పవిత్రమైందని, మాలాధారనతో పాదయాత్రగా వెళ్లడమనేది మరింత కఠినమైందన్నారు. కార్యక్రమంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గుండయ్య గురుస్వామి, ఆగమయ్య గురుస్వామి, పాదయాత్ర స్వాములు పాల్గొన్నారు.