📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
  • యంత్రాల భద్రత, నిల్వ ఏర్పాట్లు, రికార్డుల పరిశీలన.
నిర్మల్ నవంబర్ 9 సాక్షర ప్రతినిధి.
ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల భద్రపరిచే గోదాంను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల భద్రతా ఏర్పాట్లతో పాటు నిల్వ విధానాన్ని పరిశీలించారు. సంబంధిత రికార్డులను తనిఖీ చేసి, నిర్వహణ వివరాలను సమీక్షించారు.
ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి స్వాతి, తహసీల్దార్ రాజు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు