జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో రాఘవేంద్ర కరిమల విద్యార్ధి
జన్నారం మండలకేంద్రంలోని రాఘవేంద్ర కరిమల జూనియర్ కళాశాల విద్యార్ధి జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటిలలో ఉత్తమ ప్రతిబ కనబరిచినట్లు రాఘవేంద్ర సంస్థల చైర్మెన్ ఎర్ర చెంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం రోజున అయన మాట్లాడుతూ రాఘవేంద్ర కరిమల కళాశాల ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొట్టే అభిషేక్ దేశ రాజదాని డిల్లీలో జరిగిన జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటిలలో ఉత్తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో 7 వ స్థానం పొందాడని అయన తెలిపారు. మా విద్యా సంస్థలలోని సిబ్బంది మా విద్యార్థులకు మంచి క్రమశిక్షణతోకూడిన విద్యను అందిస్తూ క్రీడలు సామజిక సేవ తదితర రంగాలలో ఉత్తమంగా తీర్చి దిద్దుతున్నారని ఏకాగ్రత పట్టుదల వుంటే ఏదైనా సాదించవచ్చు అనే అభిషేక్ నిరూపించాడని అయన అన్నారు. ఈ సందర్బంగా చైర్మెన్ తోపాటు అధ్యాపకులు సిబ్బంది అభిషేక్ ను అబినందించారు.
