📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

వి ఓ భవనానికి భూమిపూజ చేసిన సర్పంచ్ సామల్ల విజయలక్ష్మిలక్ష్మీరాజం

◉ Kotha Venugopal   |   ◷ Latest
వి ఓ భవనానికి భూమిపూజ చేసిన సర్పంచ్ సామల్ల  విజయలక్ష్మిలక్ష్మీరాజం
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సామల్ల విజయలక్ష్మిలక్ష్మిరాజం వి ఓ నూతన భవనానికి భూమిపూజ చేశారు. సోమవారం రోజున గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గ్రామంలో మహిళా సంఘాల సౌకర్యార్థం నూతన వి ఓ భవనం కొరకు ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రజల అబివృద్ది గ్రామాన్ని అన్ని రంగాలలో అందరి సహకారంతో అబివృద్ది చేస్తున్నామని ఆమె తెలిపారు. గ్రామంలోని మహిళా సంఘాల కార్యక్రమాలకొరకు వి బి జి రాం నిదులనుండి ఈ నూతన భవనం నిర్మించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటపల్కుల లక్ష్మీనారాయణ వార్డు సబ్యులు రాజేష్ రవి శంకర్ మహేష్ గ్రామ పెద్దలు కాశెట్టి లక్ష్మన్ తాటికొండ రమేష్ సామల్ల లక్ష్మీరాజం కేశన్న శ్రీనివాస్ కార్యదర్శి సల్వాజి సంతోష్ ఐ కే పి సిబ్బంది సదాచారి రమాదేవి రజిత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.