నెహ్రూ జయంతికి నివాళులర్పించే నాయకుడే కరువు!
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహానికి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాల్సి ఉండగా, కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అక్కడికి చేరుకోకపోవడం గమనార్హం. దేశానికి తొలి ప్రధానమంత్రిగా సేవలందించిన నెహ్రూ జయంతి రోజున ఆయన విగ్రహం పూలమాలలకు నోచుకోకుండా ఉండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతంగా పేరున్న రామచంద్రపురంలో నేడు పార్టీ నాయకులే కనిపించని పరిస్థితి నెలకొందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కనీసం పార్టీ వ్యవస్థాపక భావజాలానికి, జాతీయ నాయకుల జయంతి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేని స్థితికి రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ చేరుకుందా? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
నెహ్రూ జయంతి రోజే కాంగ్రెస్ నాయకుల గైర్హాజరు.. రామచంద్రపురంలో పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
