అనారోగ్యంతో బాధపడుతున్న యోగేష్‌కు ప్రజా ట్రస్ట్ చైర్మన్ పరామర్శ
- చింతల్‌బోరిలో యోగేష్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న భోస్లే మోహన్‌రావు పాటిల్.. కుటుంబ సభ్యులకు ధైర్యం, భరోసా
అనారోగ్యంతో బాధపడుతున్న యోగేష్‌ను ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ భోస్లే మోహన్‌రావు పాటిల్ పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ రోజు చింతల్‌బోరి గ్రామంలో యోగేష్ నివాసానికి స్వయంగా వెళ్లిన భోస్లే మోహన్‌రావు పాటిల్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకుని, మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కష్ట సమయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, యోగేష్ కుటుంబానికి ప్రజా ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలవడం, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు మనోధైర్యాన్ని అందించడం ప్రజా ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాసేవలో భాగంగా అవసరమైన వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.
కష్టకాలంలో బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా కల్పించడం ద్వారా మానవతా విలువలను చాటుకుంటున్న ప్రజా ట్రస్ట్ సేవలను పలువురు అభినందిస్తున్నారు.
ప్రజాసేవే లక్ష్యం.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే ప్రజా ట్రస్ట్ ఆశయం.
