📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

క్రీడలతో చురుకుదనం..

◉ M VIJAYA   |   ◷ Latest
క్రీడలతో చురుకుదనం..
  • ఎస్ఓ టు జిఎం స్వామి రాజు.
రెబ్బెన,సాక్షర:నిత్యం క్రీడా సాధన చేసే వారు శారీరకంగా,మానసికంగా చురుగ్గా ఉంటారని బెల్లంపల్లి ఏరియా ఎస్ఓ టు జిఎం ఇ.స్వామిరాజు అన్నారు.డబ్ల్యూపీఎస్ అండ్ జిఏ 93వ వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా శనివారం గోలేటిలోని శ్రీ భీమన్న క్రీడా మైదానంలో నియర్ అథ్లెటిక్స్ పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ క్రీడాకారులు నిత్యం ఓ గంట పాటు మైదానంలో గడిపితే ఆసుపత్రికి వెళ్ళే అవసరం ఉండదని ఆరోగ్యంతో పాటు ఆదాయం పెరుగుతుందన్నారు. బెల్లంపల్లి,మందమర్రి ఏరియాల ఉద్యోగ క్రీడాకారులు ప్రతి దినం నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ సమిష్టిగా పోటీల్లో పాల్గొని కోల్ ఇండియా స్థాయిలో రాణించాలని అన్నారు. గతంలో పతకాలు సాధించిన సీనియర్ క్రీడాకారులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏఐటియూసి బ్రాంచి కార్యదర్శి ఎస్. తిరుపతి,డీజీఎం పర్సనల్ దేవరకొండ కిరణ్ బాబు, డబ్ల్యూపీఎస్ అండ్ జిఏ గౌరవ కార్యదర్శి డి.ప్రశాంత్,స్పోర్ట్స్ సూపర్వైసర్ అశోక్,స్పోర్ట్స్ కోఅర్దినేటర్ కిరణ్ బాబు,జనరల్ క్యాప్టెన్ అబ్బాస్,ఏఐటియుసి నాయకులు మారం శ్రీనివాస్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.