📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఈ నెల 16న ప్రత్యేక పిల్లల ప్రజావాణి నిర్వహణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి చర్యలు.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి చర్యలు.
  • లబ్ధిదారులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి – జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా .
నిర్మల్, నవంబర్ 12 (సాక్షర ప్రతినిధి):
అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందించడంతో పాటు, లబ్ధిదారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం సోన్ మండలంలోని సంగెంపేట్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్లకు కల్పించిన విద్యుత్, రహదారులు, మురుగునీటి కాలువలు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఇళ్లలో నివసించేందుకు అవసరమైన అన్ని వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించవచ్చని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం గ్రామస్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ వికసిత్ భారత్ – ఉపాధి, జీవనోపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పనులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో రామకృష్ణ, గృహ నిర్మాణ శాఖ డీఈ గంగాధర్, సర్పంచ్ విలాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.