రోడ్డు ప్రమాద బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలి.. వైద్యులను కోరిన ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్
- ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబానికి అండగా నిలిచి, తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని విజ్ఞప్తి
ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ భోస్లే మోహన్ రావు పాటిల్ మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు.
ఎడబిడ్ గ్రామానికి చెందిన జిందెవర్ పోతన్న రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సంబంధిత వైద్యులను సంప్రదించి, బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, వైద్య ఖర్చులు భరించే స్థోమత కూడా లేదని వైద్యులకు వివరించారు. మానవతా దృక్పథంతో స్పందించి, బాధితుడికి వీలైనంత తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఆపద సమయంలో బాధితులకు అండగా నిలవడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు తోడ్పాటు అందించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన సేవా దృక్పథం చాటిచెప్పింది. కష్టకాలంలో ఉన్న వారికి సహాయం అందిస్తూ మానవత్వమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
