📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
‹
›
District News

రబీ సీజన్ ప్రణాళిక, విద్య, భూసేకరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

◉ Kotha Venugopal   |   ◷ Latest
రబీ సీజన్ ప్రణాళిక, విద్య, భూసేకరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
                                                          రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
మంచిర్యాల సాక్షర
రాబోయే రబీ సీజన్ ప్రణాళిక, విద్య, భూసేకరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే రబీ సీజన్‌కు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టాలని, రైతులకు అవసరమైన సాగునీటి సదుపాయాలు కల్పించేందుకు సూక్ష్మ సేద్యం, ఉద్యానవన శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాలని, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రాయితీ విత్తనాల పంపిణీ, పంటల మార్పిడి, సూక్ష్మ సేద్య పరికరాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును నిరంతరం పర్యవేక్షించాలని, సగటున రాష్ట్రస్థాయిలో విద్యార్థుల హాజరు 73.74 శాతం ఉండగా, జిల్లా స్థాయిలో 72.21 శాతంగా ఉందని, ఉపాధ్యాయుల హాజరు రాష్ట్ర స్థాయిలో 87.06 శాతం, జిల్లా స్థాయిలో 88.05 శాతంగా నమోదు అయిందని తెలిపారు. ఉపాధ్యాయుల హాజరుకు అనుగుణంగా విద్యార్థుల హాజరు పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపడేందుకు డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగాన్ని పెంచాలని, మరిన్ని పాఠశాలలు, విద్యార్థులను వాటిలో భాగస్వాములను చేయాలని సూచించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల విద్యాసంస్థలు, ఇతర విద్యాసంస్థలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరు, విద్యాబోధన, మౌలిక సదుపాయాలను పరిశీలించాలని సూచించారు. సమగ్ర శిక్షా పథకం క్రింద చేపట్టిన సివిల్ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ప్రవేశాల లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 96 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో 11 వేల 520 సీట్లకు గాను 7 వేల 107 ప్రవేశాలు నమోదుతో సుమారు 61.69 శాతం సీట్లు భర్తీ అయ్యాయని, సీట్ల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. డిగ్రీ కళాశాలలలో ఎఫ్.ఆర్.ఎస్. విధానంపై దృష్టి సారించాలని తెలిపారు.వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని తెలిపారు. జిల్లా స్థాయి కమిటీల ద్వారా ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో చేపడుతున్న భూసేకరణ పనుల పురోగతిని సమీక్షించారు. భూసేకరణకు సంబంధించి అవార్డు జారీ, పరిహారం పంపిణీ, భూముల స్వాధీనం మధ్య ఉన్న వ్యత్యాసాలను తగ్గించాలని తెలిపారు. అవార్డు జారీ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అర్హులైన భూయజమానులకు పరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని, భూసేకరణ ప్రక్రియను నిర్ణీత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని తెలిపారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రబీ సాగుకు సంబంధించి రైతులకు తక్కువ నీటి అవసరం ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగుతో పాటు రాయితీ విత్తనాల పంపిణీపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థలను అధికారుల సమన్వయంతో క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా, ప్రభుత్వ విద్య సంస్థలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.