ఛఠ్ పూజకు ఐలేష్‌కు ఆహ్వానం
రామచంద్రపురం: ఛఠ్ పూజ వేడుకల నిర్వహణకు సంబంధించి యూపీ, బీహార్ వాసుల అసోసియేషన్ సభ్యులు రామచంద్రపురం సీనియర్ నాయకుడు ఐలేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాయసముద్రం చెరువు కట్టపై నిర్వహించనున్న ఛఠ్ పూజ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన రామచంద్రపురంలో అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో పండుగలు నిర్వహించుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోందని పేర్కొన్నారు.
