📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
‹
›
District News

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
  • బ్లాక్ స్పాట్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జి. జానకి షర్మిల
నిర్మల్ నవంబర్ 13సాక్షర ప్రతినిధి
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల సూచించారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా సమావేశంలో వారు పాల్గొని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై అక్రమ పార్కింగ్, ఆక్రమణలను తొలగించాలని, పశువులు రోడ్లపై సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూ........ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని, మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించేవారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్, ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేందర్, రహదారులు, భవనాల శాఖ ఈఈ సుభాష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.