📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
22°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి తిరిగి సేవ చేయాలి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి తిరిగి సేవ చేయాలి
  • సమాజం అందించిన అవకాశాలతో ఉన్నత స్థాయికి చేరుకున్నవారు పేదలు, నిరుద్యోగ యువత అభ్యున్నతికి తోడ్పడాలి – బహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా కార్యదర్శి చెరుకు రాజ్యం
నిర్మల్ నవంబర్ 23 సాక్షర ప్రతినిధి
ప్రభుత్వ ఉద్యోగం అనేది కేవలం జీతం, హోదా, అధికారం మాత్రమే కాదని, అది ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన గొప్ప బాధ్యత అనిబహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా కార్యదర్శి చెరుకు రాజ్యం అన్నారు. సమాజం నుంచి పొందిన అవకాశాలను తిరిగి సమాజ అభివృద్ధికి వినియోగించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నైతిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించి, ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వ వ్యవస్థలో ఉద్యోగాలు పొందిన వారు సమాజం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఎంత ముఖ్యమో, తమలాంటి పరిస్థితుల్లో ఉన్న పేద విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించడం అంతకంటే ముఖ్యమని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమకు ఉన్న జ్ఞానం, అనుభవం, సమయాన్ని సమాజ శ్రేయస్సు కోసం కొంతైనా కేటాయించాలని కోరారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు విద్యాపరమైన మార్గదర్శకత్వం అందించడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన
కల్పించడం, గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించడం వంటి అలాగే పేదలకు విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా తమ వంతు సహకారం అందించాలని, సమాజంలో విద్యా చైతన్యం, సామాజిక సమానత్వం పెంపొందించేందుకు కృషి చేయాలని అన్నారు.సమాజం అందించిన సహకారంతో ఎదిగిన ప్రతి ఒక్కరూ తిరిగి సమాజ అభివృద్ధికి చేయూతనివ్వాలని, సంపదలో కొంత ఇవ్వడం కంటే తమ జ్ఞానంలో కొంత, సమయాన్ని, అనుభవాన్ని పంచుకోవడం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.ప్రభుత్వ ఉద్యోగం జీవనోపాధిని కల్పిస్తే, సమాజ సేవ జీవితానికి నిజమైన గౌరవాన్ని తీసుకొస్తుంది. సమాజం కోసం పనిచేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత కావాలి అని చెరుకు రాజ్యం పేర్కొన్నారు.