శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయంలో జంతుబలి నిషేధం
- నవంబర్ 26న పునఃప్రతిష్ఠాపన తొలి వార్షికోత్సవం.. భక్తులు, ప్రజలు సహకరించాలి
నిర్మల్ నవంబర్ 23 సాక్షర ప్రతినిధి
జిల్లా సారంగాపూర్ మండలం లోనీ శ్రీ అడెల్లి మహాపోచమ్మ ఆలయంలో ఈ నెల 26వ తేదీ గురువారం నిర్వహించనున్న పునఃప్రతిష్ఠాపన తొలి వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జంతుబలిని పూర్తిగా నిషేధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో మేకలు, గొర్రెలు, కోళ్లను బలి ఇవ్వడం, కోయడం వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అమ్మవారి పునఃప్రతిష్ఠాపన తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలని కోరారు.ఈ నిబంధనలను ప్రతి ఒక్కరూ గమనించి,ఎలాంటి జంతుబలి కార్యక్రమాలు నిర్వహించకుండా ఆలయ నిర్వాహకులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.